
Padi kaushik reddy: పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. విచారణకు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి (padi kaushik reddy) మంగళవారం చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.
ఎన్నికల్లో తనను గెలిపించకపోతే తన శవయాత్రే ఉంటుందని, కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని కౌశిక్ రెడ్డి ప్రచారం చివరి రోజు అనడంపై ఈసీ సీరియస్ అయ్యింది.
కమలాపూర్ మండల కేంద్రంలో రోడ్డు షో నిర్వహించిన సమయంలో కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసే విధంగా ఉన్నాయని భావించిన ఈసీ.. వెంటనే విచారణకు ఆదేశించింది.
ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపి నివేదికను అందజేయాలని స్థానిక ఆర్వోకు ఆదేశాలు జారీ చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇవే
BRS Candidate Padi Kaushik Reddy‘s Emotional Blackmail to Voters.
— M9.NEWS (@M9Breaking) November 28, 2023
"మీరు ఓటేసి దీవిస్తే 4వ తారీకు నా జైత్రయాత్ర
గెలిపించకుంటే మా కుటుంబ సభ్యులు ముగ్గురం శవయాత్ర చేసుకుంటాం"#Huzurabad pic.twitter.com/mqOyvM9W2E