BRS Party: దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయండి.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నేతృత్వంలోని బీఆర్‌ఎస్ నేతలు సోమవారం తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిశారు.
ఫిరాయింపులనిరోధక చట్టం ప్రకారం దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు సమర్పించింది.
అనంతరం హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ఇచ్చిన బీ-ఫారంపై నాగేందర్ ఖైరతాబాద్‌లో గెలుపొందారని,సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లో ఆయనపై అనర్హత వేటు వేయాలని అన్నారు.
బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు స్పీకర్‌ను కలిశాం.ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా స్పీకర్ చర్యలు ప్రారంభించాలి.ఒక పార్టీ గుర్తుపై ఎన్నికై మరో పార్టీలోకి మారడం మంచిది కాదు'అని ఆయన అన్నారు.
Details
ఖమ్మం,నల్లగొండ కాంగ్రెస్ బాంబులు ఎపుడైనా పేలచ్చు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టండి అంటూ చెప్పాడని గుర్తు చేశారు.
అదే రేవంత్ రెడ్డి దానం ను బీడీ లు అమ్ముకునే వాడు అని చెప్పాడని తెలిపారు.ఇప్పుడు కాంగ్రెస్ లో చేర్చుకున్నారు అదే బీడీలు అమ్మిస్తారా? అంటూ ప్రశ్నించారు.
దానం నాగేందర్ తదితరుల ఫిరాయింపులను బీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు.
మీరు గేట్లు తెరిచారని అంటున్నారు మేము తెరిచే టైం వచ్చింది తెరిస్తే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు.
ఐదేళ్లు మేము ఈప్రభుత్వం కొనసాగాలనే కోరుకుంటున్నామని తెలిపారు.రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండొచ్చు..కాంగ్రెస్ లో జరిగే అంతర్గత కలహాలకు మేము భాద్యులం కామని క్లారిటీ ఇచ్చారు.
ఖమ్మం,నల్లగొండ కాంగ్రెస్ బాంబులు ఎపుడైనా పేలోచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.