Page Loader
కర్ణాటక తరహాలోనే తెలంగాణలో అధికారంలోకి వస్తాం: ఖమ్మం సభలో రాహుల్ గాంధీ
కర్ణాటక తరహాలోనే తెలంగాణలో అధికారంలోకి వస్తాం: ఖమ్మం సభలో రాహుల్ గాంధీ

కర్ణాటక తరహాలోనే తెలంగాణలో అధికారంలోకి వస్తాం: ఖమ్మం సభలో రాహుల్ గాంధీ

వ్రాసిన వారు Stalin
Jul 02, 2023
09:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. జిల్లాకు చెందిన కీలక నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొంగులేటికి రాహుల్ గాంధీ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ రిమోట్‌ కంట్రోల్‌ ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో ఉందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్‌ను 'బీజేపీ బీ టీమ్‌'గా అభివర్ణించారు. బీఆర్ఎస్ ప్రమేయం ఉన్న ఏ కూటమిలోనూ కాంగ్రెస్ చేరదని రాహుల్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఇతర ప్రతిపక్ష నాయకులందరికీ చెప్పానని పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఖమ్మం సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్

భారత్ జోడో యాత్రకు తెలంగాణ నుంచి భారీ మద్దతు 

కేసీఆర్ తనను రాజుగా భావిస్తున్నారని, తెలంగాణ తన రాజ్యమని అనుకుంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. అవినీతి, పేదల వ్యతిరేక ప్రభుత్వాన్ని కర్ణాటకలో ఓడించామని, రాష్ట్రంలోని పేదలు, ఓబీసీలు, మైనారిటీలు, అణగారిన ప్రజల మద్దతుతో తమ పార్టీ బీజేపీని ఓడించామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా కర్ణాటక తరహాలో అధికార పార్టీని ఓడిస్తామన్నారు. తెలంగాణలో బీజేపీకి అసలు ఉనికి లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీ-టీమ్- కాంగ్రెస్ మధ్య పోరు ఉంటుందని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో తమకు తెలంగాణ నుంచి భారీ మద్దతు లభించిందన్నారు. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

4,000 పింఛన్ పోస్టర్ ఆవిష్కరణ

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాంగ్రెస్‌లో చేరుతున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి