BRS manifesto: బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన.. ప్రతి ఇంటికీ 'కేసీఆర్ బీమా'.. పెన్షన్, రైతు బంధు పెంపు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తెలంగాణలో భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మేనిఫెస్టో గురించి వివరించారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు కేసీఆర్ చెప్పారు. ఆసరా పెన్షన్లు రూ.5వేలకు పెంపు వృద్ధులకు ఇచ్చే ఆసరా పెన్షన్‌ను 5 వేలకు పెంచాలని నిర్ణయం నిర్ణయం. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది రూ.3వేలు ఇచ్చి.. తర్వాత ఏడాదికి రూ.500 మంది చొప్పున పెంచుతామని కేసీఆర్ వెల్లడించారు. దివ్యాంగులకు ప్రస్తుతం 4016 పెన్షన్ ఇస్తున్నారు. దీన్ని వచ్చే ఐదేళ్లలో 6వేలకు పెంచాలని కేసీఆర్ నిర్ణయం.
రైతుబంధు రూ.16 వేలకు పెంపు
తెలంగాణలో ఎంతో పాపులర్ అయిన రైతు బంధు సాయాన్ని రూ.16వేలకు పెంచాలని నిర్ణయం. మొదటి సంవత్సరం రూ.12వేలు ఇచ్చి.. తర్వాత దశలవారీగా పెంచనున్నారు. రూ.400కే గ్యాస్ సిలిండర్ తెలంగాణలో నిరుపేదలైన అర్హులైన మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేయాలని నిర్ణయం. జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేత. రైతుబీమా తరహాలో కేసీఆర్ బీమా రైతుబీమా తరహాలో తెలంగాణలోని 93 లక్షల కుటుంబాలకు బీమా సదుపాయం కల్పించేందుకు 'కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికీ ధీమా' అనే పద్ధతిలో బీమా సదుపాయం. తెలంగాణ అన్నపూర్ణ పథకం రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయం.
పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి
ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. సౌభాగ్యలక్ష్మీ పథకం కింద తెల్ల రేషన్ కార్డులు ఉన్న పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి ఇవ్వనున్నారు. మైనార్టీలకు కేటాయించే బడ్జెట్ పెంపు కులవృత్తులకు ఆర్థికసాయం కొనసాగుతుందని కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు.. హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇళ్లస్థలాలు ఉన్నవారికి గృహలక్ష్మీ కొనసాగిస్తామని, స్థలాలు లేనివారికి ఇళ్ల జగాలను ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేస్తామని కేసీఆర్ ప్రకిటంచారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టో
బీఆర్ఎస్ మానిఫెస్టో ప్రకటించిన సీఎం కేసీఆర్#BRSmanifesto 1/3 pic.twitter.com/BREjdYWB8Y— Telugu Scribe (@TeluguScribe) October 15, 2023