తదుపరి వార్తా కథనం

KCR: సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా
వ్రాసిన వారు
Stalin
Dec 03, 2023
05:25 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పారాజయం పాలైంది.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజీనామా చేసారు.
అయితే కేసీఆర్ నేరుగా రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేయలేదు.
తన ఓఎస్డీ ద్వారా కేసీఆర్ రాజీనామా లేఖను గవర్నర్ తమిళసైకు పంపారు.
ఇదిలా ఉంటే, కేసీఆర్.. సెక్యూరిటీ లేకుండా ప్రగతి భవన్ నుంచి ప్రైవేటు వాహనాల్లో ఫామ్ హౌస్‌కు వెళ్లారు.
తొలుత ఎలాంటి సెక్యురిటీ లేకుండా కేసీఆర్ ప్రైవేటు వాహనాల్లో వెళ్లడంపై పోలీసులు ఆందోళన చెందారు.
ఆయన ఫామ్ హౌస్ వైపు వెళ్తున్న సమాచారం అందడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఓఎస్డీతో రాజీనామా లేఖను పంపిన కేసీఆర్
ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్‌కు కేసీఆర్ - రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపిన కేసీఆర్ #kcr #winspiremedia pic.twitter.com/gGO7crEo3K
— Winspire Media (@WinspireMedia) December 3, 2023
మీరు పూర్తి చేశారు