Telangana: ఆదిలాబాద్ లో బిఆర్ఎస్ కు షాక్ .. హస్తం గూటికి మాజీ ఎమ్మెల్సీ
ఆదిలాబాద్ లో బిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఎఐసీసీ ఇంచార్జ్ దీప్ దాస్ మున్షీ సమక్షంలో మాజీ ఎమ్యెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం అయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయం నుండి కేసీఆర్ తో ఉన్నానని, బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రము ఆగమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ ఆధ్వర్యంలో తెలంగాణ ముందుకు పోతుందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని పూర్ణం సతీష్ అన్నారు.పురాణం సతీష్ కాంగ్రెస్ లో చేరికకు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ కీలకంగా వ్యవహరించారు.