Page Loader
Telangana Elections: తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థులపై భారీగా క్రిమినల్ కేసులు.. నేరచరిత్రలో ఏ పార్టీ టాప్? 
Telangana Elections: తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థులపై భారీగా క్రిమినల్ కేసులు.. నేరచరిత్రలో ఏ పార్టీ టాప్?

Telangana Elections: తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థులపై భారీగా క్రిమినల్ కేసులు.. నేరచరిత్రలో ఏ పార్టీ టాప్? 

వ్రాసిన వారు Stalin
Nov 22, 2023
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, ప్రధాన రాజకీయ పార్టీల తరఫున బరిలోకి దిగిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది క్రిమినల్ కేసుల్లో ఉన్నారని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) వెల్లడించింది. అభ్యర్థుల అఫిడవిట్ల డేటా ప్రకారం ఎఫ్‌జీజీ ఈ నివేదికను తయారు చేసింది. తెలంగాణలో 119అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ స్థానాలకు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం తరఫున 360 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. వీరిలో 226 మంది నేరచరితులే ఉన్నట్లు ఎఫ్‌జీజీ తేల్చింది. నేర చరిత్ర ఎక్కువగా ఉన్న పార్టీల్లో కాంగ్రెస్ టాప్‌లో ఉంది. కాంగ్రెస్ తరఫున 118 మంది నామినేషన్ దాఖలు చేయగా అందులో 84మందిపై 540 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

కాంగ్రెస్

కేసుల్లో రేవంత్ రెడ్డి, రాజాసింగ్ టాప్

నేర చరిత్ర ఉన్న పార్టీల జాబితాలో బీజేపీ రెండో స్థానంలో ఉంది. బీజేపీ అభ్యర్థుల్లో 78 మందిపై 549 క్రిమినల్ కేసులు ఉన్నాయి. బీఆర్ఎస్ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 58 మంది నేరచరితులు ఉన్నారు. ఏఐఎంఐఎం అభ్యర్థుల్లో ఆరుగురికి మాత్రమే నేర చరిత్ర ఉంది. మల్కాజిగిరి ఎంపీ, కొండగల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రేవంత్‌రెడ్డిపై 89 కేసులు, బీజేపీకి చెందిన గోషామహల్‌ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌పై 89 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ జాబితాలో 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కొందరిపై నమోదైన కేసులు కూడా ఉన్నాయి.

బీజేపీ

సీఎం కేసీఆర్‌పై ఎన్ని కేసులు ఉన్నాయంటే?

కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి తర్వాత 52 కేసులతో వెదమ్మ బొజ్జు, 32 కేసులతో కొక్కిరాల ప్రేంసాగర్ రావు, 24 కేసులతో పురుమళ్ల శ్రీనివాస్, 20 కేసులతో టి జయప్రకాష్ రెడ్డి ఉన్నారు. బీజేపీలో కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌పై 59, బోథ్ అభ్యర్థి సోయం బాపురావుపై 55, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై 40 కేసులు, కోరుట్ల అభ్యర్థి అరవింద్ ధర్మపురిపై 17 కేసులు ఉన్నాయి. బీఆర్ఎస్‌లో ఈ వర్గంలో 58 మంది ఎమ్మెల్యే అభ్యర్థులపై 120 కేసులు నమోదయ్యాయి. ఇందులో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై అత్యధికంగా 10 కేసులు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌పై 9 కేసులు, సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కెటి రామారావుపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి.