Page Loader
T Padma Rao Goud: సికింద్రాబాద్ BRS ఎంపీ అభ్యర్థిగా పద్మారావు‌గౌడ్
T Padma Rao Goud: సికింద్రాబాద్ BRS ఎంపీ అభ్యర్థిగా పద్మారావు‌గౌడ్

T Padma Rao Goud: సికింద్రాబాద్ BRS ఎంపీ అభ్యర్థిగా పద్మారావు‌గౌడ్

వ్రాసిన వారు Stalin
Mar 23, 2024
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా తీగుళ్ల పద్మారావు గౌడ్ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పద్మారావు గౌడ్ ప్రస్తుతం సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతలు, ఇతర ఎమ్మెల్యేలతో కూలంకషంగా చర్చించిన తర్వాత పద్మారావు గౌడ్‌ను రంగంలోకి దింపాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. 'పజ్జన్న' అని పిలుచుకునే పద్మారావు గౌడ్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన రోజుల నుంచి కేసీఆర్‌కు విధేయుడు. సికింద్రాబాద్ నుంచి వరుసగా మూడోసారి శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. అయన ఎక్సైజ్ & ప్రొహిబిషన్, క్రీడలు,యువజన వ్యవహారాల మాజీ మంత్రి, తెలంగాణ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా పద్మారావు