Page Loader
KTR: అభిమాని ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించిన కేటీఆర్‌ 
KTR: అభిమాని ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించిన కేటీఆర్‌

KTR: అభిమాని ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించిన కేటీఆర్‌ 

వ్రాసిన వారు Stalin
Jan 08, 2024
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

అభిమాని పిలుపు మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ మేరకు అభిమాని ఆతిథ్యాన్ని స్వీకరించారు. హైదరాబాద్‌లోని బోరబండ బంజారానగర్‌లో నివాసం ఉంటున్న ఇబ్రహీంఖాన్‌.. కొత్త సంవత్సరం వేళ జనవరి 2న కేటీఆర్‌కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ఈక్రమంలో తన ఇంటికి రావాలని, ఆతిథ్యం స్వీకరించాలని ఇబ్రహీంఖాన్‌ కోరారు. అభిమాని కోరిక మేరకు కేటీఆర్‌ ఆదివారం ఇబ్రహీంఖాన్‌ ఇంటికెళ్లారు. ఈ సందర్భంగా ఇబ్రహీంఖాన్‌ కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. గతంలో ఇబ్రహీంఖాన్‌ దివ్యాంగులైన తమ పిల్లలకు పింఛను ఇప్పించాలని కేటీఆర్‌ను ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. ఆసరా పింఛన్‌ను మంజూరు చేశారు. నాడు చేసిన సాయాన్ని ఇబ్రహీంఖాన్‌ గుర్తు చేసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేటీఆర్ ట్వీట్