
Vijayashanti: కాంగ్రెస్ ప్రభుత్వం 6నెలల్లో కూలిపోతుందన్న వార్తలపై విజయశాంతి కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పాలన మొదలైన మొదటి వారం నుంచి ఈ ప్రభుత్వం 6నెలలకు మించి ఉండదని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ కాగా.. యశోద ఆస్పత్రిలో ఆయన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వెళ్లి పరామర్శించారు.
ఈ పరామర్శ తర్వాత కాంగ్రెస్ కూలిపోతుందన్న వార్తలు మరింత ఎక్కువయ్యాయి.
ఈ విమర్శలపై కాంగ్రెస్ నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌ను కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారన్నారు.
కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి కలవడంపై కొంతమంది బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకంగా ప్రచారం చేయడం తగదని మండిపడ్డారు.
మానవీయ కోణానికి రాజకీయంతో ముడిపెట్టడం సరికాదని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేసారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విజయశాంతి ట్వీట్
బీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ గారికి సర్జరీ జరిగి హాస్పిటల్‌ల ఉంటే, మర్యాద పూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు కలిసి ఓదార్పు చెబితే.. అందుకు కూడా కొంతమంది బీఆరెస్ ముఖ్యులు వ్యతిరేక కామెంట్స్ పోస్ట్ చెయ్యడం అసమంజసం.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) December 12, 2023
మానవీయ స్పందనకు రాజకీయాన్ని కలపడం నేటి బీఆరెస్‌కు అవసరమేమో కానీ,… pic.twitter.com/uVjcAC5VoM