NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mahabubnagar MLC Bypoll: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బై ఎలక్షన్ లో BRS గెలుపు
    తదుపరి వార్తా కథనం
    Mahabubnagar MLC Bypoll: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బై ఎలక్షన్ లో BRS గెలుపు
    స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బై ఎలక్షన్ లో BRS గెలుపు

    Mahabubnagar MLC Bypoll: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బై ఎలక్షన్ లో BRS గెలుపు

    వ్రాసిన వారు Stalin
    Jun 02, 2024
    10:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌(BRS)ఘన విజయం సాధించింది. దీనితో ఆ పార్టీ భారీగా ఊపిరిపీల్చుకున్నట్లయింది.

    ఈ ఎన్నికను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఐనా సరే BRS అభ్యర్థి నవీన్‌కుమార్‌ రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో విజదుందుభి మోగించి సంచలనం సృష్టించారు.

    మంగళవారం వెలువడనున్న లోక్ సభ ఫలితాల్లో BRS కు ఆశించిన మేర ఫలితాలు రాకపోవచ్చని అంచనాగా వుంది. ఈ నేపధ్యంలో నవీన్‌కుమార్‌..కారు పార్టీకి జీవం పోశారనే చెప్పాలి.

    కాగా మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడం విశేషం. దీంతో సొంత జిల్లాలో సీఎం రేవంత్‌ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

    మళ్లీ తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు.

    Details 

    పోటీకి దూరంగా  బీజేపీ 

    ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కశిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారారు.

    ఆ తర్వాత కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో మార్చి 28న ఎన్నికలు నిర్వహించారు.

    బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌కుమార్‌ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మన్నె జీవన్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ బరిలో నిలిచారు.

    ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    తెలంగాణ: ప్రధాని మోదీ పర్యటన వేళ.. బీజేపీ- బీఆర్ఎస్ పోస్టర్ వార్  తెలంగాణ
    కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    BRS manifesto: బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన.. ప్రతి ఇంటికీ 'కేసీఆర్ బీమా'.. పెన్షన్, రైతు బంధు పెంపు తెలంగాణ
    India TV-CNX Opinion Poll: తెలంగాణలో మూడోసారి అధికారం బీఆర్ఎస్‌దే.. ఒపీనియన్ పోల్ అంచనా  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025