LOADING...
KTR: బిఆర్ఎస్ ఎల్పీ లీడర్ గా కేటీఆర్..! 
KTR: బిఆర్ఎస్ ఎల్పీ లీడర్ గా కేటీఆర్..!

KTR: బిఆర్ఎస్ ఎల్పీ లీడర్ గా కేటీఆర్..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2023
08:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనుకున్న బిఆర్ఎస్ కల కలగానే మిగిలిపోయింది. ఈరోజు తెలంగాణ భవన్‌లో కొత్తగా ఎన్నికైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తొలి సమావేశాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా హాజరయ్యారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరును, ఎన్నికల్లో పార్టీ పరాజయానికి గల కారణాలను కేటీఆర్ విశ్లేషించారు. బీఆర్‌ఎస్‌ ఓటమి, ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై పార్టీ ద్రుష్టి సారించింది. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యచరణతో బాటు బిఆర్ఎస్ ఎల్పీ నేత ఎవరనే దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మెజారిటీ ఎమ్యెల్యేలు కేటీఆర్ వైపు మొగ్గు చూపినట్టు సమాచారం.

Details 

కారు దిగి హస్తం గూటికి వెళ్లనున్న మల్లారెడ్డి 

ఈ సమావేశానికి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి,ఆయన అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరు కాకపోవడం చర్చీనీయాంశంగా మారింది. త్వరలోనే ఈ ముగ్గరు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు.మల్లారెడ్డికి హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో వేల కోట్ల విలువైన భూములు,మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. వీటిలో కొన్నిఅసైన్డ్ లాండ్స్ ఉన్నాయి.అప్పట్లో రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే అసైన్డ్ లాండ్స్ పై విచారణకు ఆదేశిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి ఆస్తులను కాపాడుకునే ఉద్దేశ్యంతో కారు దిగి హస్తం గూటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మామ వెళ్లే రూట్లోనే అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం.