బీఆర్ఎస్‌లో చేరిన నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి.. ఆహ్వానించిన కేసీఆర్
ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, పి.జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాగం, విష్ణువర్ధన్ రెడ్డితో పాటు వారి అనుచరులను తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. నాగంకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీకి రాజీనామా చేసిన నాగం.. ఆ తర్వాత బీజేపీలో చేరారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. ఎన్నికల్లో టిక్కెట్టు నిరాకరించడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. పీజేఆర్ మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి.. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఇటీవల పార్టీకి రాజీనామా చేసారు.