
Venkatesh Netha: బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ
ఈ వార్తాకథనం ఏంటి
BRS MP Venkatesh Netha: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.
మరికొన్ని వారాల్లో లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ బిగ్ షాక్ తగిలింది.
పెద్దపల్లి బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్(Congress)లో చేరారు.
దిల్లీలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ వెంకటేష్ కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో కేసీ వేణుగోపాల్.. వెంకటేష్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వెంకటేష్ నేత 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వెంకటేష్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న కేసీ వేణుగోపాల్
BRS MP from Peddapalli - Venkatesh Netha joined Congress
— Naveena (@TheNaveena) February 6, 2024
Ex TTD board member M Jeevan Reddy also joined Congress pic.twitter.com/IIgHSlDG93