
KCR Rajshyamala yagam: ఫాంహౌస్‌లో కేసీఆర్ రాజశ్యామలా యాగం.. మూడోసారి గెలుపు వరిస్తుందా?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యాగం చేస్తున్నారు.
మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అమ్మవారి కటాక్షం కోసం రాజశ్యామలా యాగానికి శ్రీకారం చుట్టారు.
సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో మంగళవారం నుంచి రాజ శ్యామలా యాగం నిర్వహించనున్నారు. కేసీఆర్ సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులు యాగంలో భాగమయ్యారు.
విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వామి స్వరూపానంద సరస్వతి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు యాగం జరగనుంది.
తెలంగాణ, ఆంధ్రపదేశ్, కర్ణాటక రాష్ట్రాల పీఠాధిపతులు యాగంలో పాల్గొన్నారు.
ప్రజలు, రాష్ట్ర శ్రేయస్సు కోసం కేసీఆర్ ఈ యాగం చేపట్టినట్లు బీఆర్ఎస్ చెబుతున్నా.. ఎన్నికల్లో విజయం కోసం కేసీఆర్ ఈ యాగం చేపట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేసీఆర్
గత రెండు ఎన్నికలకు ముందు కూడా యాగం చేసిన కేసీఆర్
సీఎం కేసీఆర్‌కు దైవ భక్తి ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే.
అలాగే, కీలకమైన కార్యాక్రమాలను చేపట్టిన ప్రతి సందర్భంగా యాగాలు చేయడం కేసీఆర్ ఆనవాయితీ.
గత రెండు దఫాలుగా జరిగిన ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ రాజశ్యామల యాగం చేసిన విషయం తెలిసిందే.
ఆ రెండు ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించారు. దీంతో త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూడా విజయం సాధించేందుకు అమ్మవారి కటాక్షం పొందేందుకు కేసీఆర్ ఈ యాగం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరి యాగ ఫలం సిద్ధించి.. కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వస్తారా? అనేది తెలియాలంటే.. డిసెంబర్ 3వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.