
తెలంగాణ: ప్రధాని మోదీ పర్యటన వేళ.. బీజేపీ- బీఆర్ఎస్ పోస్టర్ వార్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల మధ్య పోస్టర్ల వార్ నెలకొంది.
ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోస్టర్లు అంటించారు.
తెలంగాణ ఏర్పాటును అవమానించిన తర్వాత ఆయనకు రాష్ట్రంలో పర్యటించే నైతిక హక్కు ఆ పోస్టర్లలో రాసి ఉంది.
తెలంగాణ ఏర్పాటుపై వివిధ సందర్భాల్లో పార్లమెంట్‌లో మోదీ మాట్లాడిన మాటలను ఆ పోస్టర్లలో ఉంచారు.
"బిడ్డను రక్షించడానికి తల్లిని చంపారు" అనే ప్రధాన మంత్రి కోట్‌ను పోస్టర్‌లో పొందుపర్చారు.
తెలంగాణకు మోదీ ఇచ్చిన హామీలను కూడా ఆ పోస్టర్లలో రాసి ఉంచారు. పాలమూరుకు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని మోదీ ప్రశ్నిస్తూ పోస్టర్లు అంటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు
Ahead of PM #NarendraModi visit to #Telangana, posters, flexi surfaces against #PMModi, saying "What Happened to your promise of National Status for #PalamuruRangareddyProject ."
— Surya Reddy (@jsuryareddy) October 1, 2023
Another Poster as Ravanasur, says "Modi Promises to Telangana"#BJP #BRS #TelanganaElections2023 pic.twitter.com/EVWiZKGuiF
మోదీ
కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ పోస్టర్లు
బీఆర్ఎస్‌కు కౌంటర్‌గా బీజేపీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించింది. ఈ పోస్టర్లలను హైదరాబాద్ లో అంటించారు.
సీఎం కేసీఆర్‌ను దేశంలోనే అతిపెద్ద ఎమ్మెల్యేల కొనుగోలుదారుగా పోస్టర్లలో రాసి ఉంది.
మోదీ పర్యటన వేళ.. ఈ పోస్టర్లు వెలియడం చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో మోదీ తెలంగాణకు వచ్చిన పలు సందర్భంగా కూడా ఇలా పోస్టర్లను అంటించిన సందర్భాలు ఉన్నాయి.
కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగిన సందర్భంలో కూడా కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య పోస్టర్ వార్ నడిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్- బీఆర్ఎస్ పరస్పరం తీవ్రస్థాయిలో విమర్శలు చేస్కున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు
4TV UPDATES ** POSTERS WAR ERUPTED IN HYDERABAD , BRS AND BJP PUT OUT POSTERS AGAINST EACH OTHER. pic.twitter.com/pfnKGpXWCq
— Shakeel Yasar Ullah (@yasarullah) October 1, 2023