Page Loader
హైదరాబాద్‌కు భీమ్‌ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్‌ ఆజాద్‌; కల్వకుంట్ల కవితతో భేటీ
హైదరాబాద్‌కు భీమ్‌ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్‌ ఆజాద్‌; కల్వకుంట్ల కవితతో భేటీ

హైదరాబాద్‌కు భీమ్‌ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్‌ ఆజాద్‌; కల్వకుంట్ల కవితతో భేటీ

వ్రాసిన వారు Stalin
Jul 27, 2023
07:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లో భీమ్‌ ఆర్మీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ కలిశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ అంబేద్కర్ విగ్రహాన్ని చూసేందుకు కవిత ఆయన్ను ఆహ్వానించారు. ఈ క్రమంలో విగ్రహాన్ని చూసేందుకు అజాద్ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ వెంట తామంతా మేమంతా ఉన్నామని స్పష్టం చేశారు. ఆయనకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆయనకు తక్షణమే భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత, మైనారిటీ, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను పరిశీలించేందుకు ఆయనను తెలంగాణకు ఆహ్వానించినట్లు కవిత పేర్కొన్నారు. అలాగే సీఎం కేసీఆర్‌ను అజాద్ కలవనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అంబేద్కర్ విగ్రహం వద్ద అజాద్, కవిత