
Tatikonda Rajaiah: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. తాటికొండ రాజయ్య రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
Tatikonda Rajaiah: శాసనసభ ఎన్నికల్లో ఓటమితో సతమతమవుతున్న బీఆర్‌ఎస్ పార్టీకి.. లోక్‌సభ ఎన్నికల వేళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజయ్యకు స్టేషన్ ఘనపూర్ సిట్టింగ్ టికెట్‌ను ఇవ్వకుండా.. కడియం శ్రీహరికి కేసీఆర్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో రాజయ్యకు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
టికెట్ రాకపోవడంతో బహిరంగగానే ఆయన కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో చర్చలు జరిపిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాంగ్రెస్‌లోకి వెళ్లనున్న రాజయ్య
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తాటికొండ రాజయ్య
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2024
త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న రాజయ్య. pic.twitter.com/CiTBpttw4b