KTR: మేడిగడ్డ విషయంలో దుష్ప్రచారం సరికాదు: కేటీఆర్
మేడిగడ్డ బ్యారేజీని కేటీఆర్ ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో వచ్చిన చిన్న సమస్యను పెద్దదిగా చేసి చూపిస్తున్నారన్నారు. ప్రాజెక్టుతో పాటు మొత్తం రూ.లక్ష కోట్లను వృథా చేసినట్లు కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది సరికాదన్నారు. మేడిగడ్డ విషయంలో బాధ్యులుపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, వానాకాలంలోగా వర్షాకాలంలో బ్యారేజీకి మరమ్మతులు చేసి రైతులు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు.
రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్లుగా: కేటీఆర్
రైతు ప్రయోజనం కాదు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డ సందర్శనకు బయలుదేరే ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు మరొక్కసారి కాళేశ్వరం గొప్పతనాన్ని వివరించడానికి పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి, మంచి నీటికి కూడా గోస రాకుండా చూసుకోవడానికే పర్యటిస్తున్నామన్నారు. 3బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు , 21 పంపింగ్ స్టేషన్లు దాదాపు 15 వందల .. 16 వందల ప్రవాహ కాలువలు, 270 కిలోమీటర్ల సొరంగం ఇదంతా కలిపితే కాళేశ్వరని వెల్లడించారు. ఈరోజు ఈ ప్రాజెక్ట్ తర్వాత అన్నారం బ్యారేజీని కూడా సందర్శిస్తామన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లను సందర్శిస్తామన్నారు.