Page Loader
KCR: తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. ఘనస్వాగతం పలికిన నాయకులు 
KCR: తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. ఘనస్వాగతం పలికిన నాయకులు

KCR: తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. ఘనస్వాగతం పలికిన నాయకులు 

వ్రాసిన వారు Stalin
Feb 06, 2024
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు వెళ్లారు. తుంటి గాయమైన తర్వాత ఆయన పార్టీ ఆఫీస్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. కేసీఆర్ చాలా రోజుల తర్వాత పార్టీ ఆఫీస్‌కు రావడంతో కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు సాగునీటి ప్రాజెక్టులను అప్పగించకుండా కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు కేసీఆర్ సీనియర్ నేతలతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రయోజనాలపై పార్టీ నిబద్ధతను ప్రజల్లోకి తీసుకపోయేలా కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలంగాణ భవన్ వద్ద కార్యకర్తల సందడి