Page Loader
KTR: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
KTR: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

KTR: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

వ్రాసిన వారు Stalin
Jan 27, 2024
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ శనివారం వినూత్నంగా ఆటోలో ప్రయాణించారు. యూసుఫ్‌గూడ్‌ నుంచి ఆయన జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ భవన్‌ వరకు ఆటోలో వెల్లడం గమనార్హం. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల వారీగా కార్యక్తల సమావేశాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ నియోజకర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు కేటీఆర్ వచ్చారు. సమావేశం అనంతరం కేటీఆర్ కారులో కాకుండా, ఆటోలో తెలంగాణ భవన్‌కు వెళ్లారు. కేటీఆర్ వెంటే.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఉన్నారు. ప్రస్తుతం కేటీఆర్ ఆటోలో ప్రయాణించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆటోలో ప్రయాణిస్తున్న కేటీఆర్