Page Loader
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు

వ్రాసిన వారు Stalin
Sep 14, 2023
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసు.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అరుణ్‌పిళ్లై అప్రూవర్‌గా మారడంతో మళ్లీ సంచలనంగా మారింది. దర్యాప్తును వేగవంతం చేయాలని అనుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మరోసారి విచారించాలని ఈడీ నిర్ణయించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. దిల్లీ లిక్కర్ కేసులో కవిత విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో వ్యాపారవేత్త అరుణ్ పిళ్లైపై ఎమ్మెల్సీ కవిత బినామీగా ఈడీ అభియోగాలు మోపింది. ఇప్పటికే కవితను పలుమార్లు విచారణ జరిపిన ఈడీ.. మళ్లీ విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కవితను శుక్రవారం విచారించనున్న ఈడీ