కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ
నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ కుటుంబ పాలనకు అడ్డగా మారిపోయిందని విమర్శంచారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని లూటీ స్వామ్యంగా మార్చేసిందన్నారు. తెలంగాణలో మొత్తం అధికారం ఒక కుటుంబం వద్దే కేంద్రీకృతమైనట్లు మోదీ పేర్కొన్నారు. కుటుంబ పాలన వల్ల ఎక్కువ నష్టం యవతకే జరుగుతుందన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన వల్ల కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, అల్లుడు మాత్రమే లబ్ధిపొందుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఫలాలకు కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే అనుభవిస్తోందని మోదీ అన్నారు.
నా కళ్లలోకి చూసే ధైర్య కేసీఆర్‌కు లేదు: మోదీ
నిజామాబాద్ సభలో కేసీఆర్‌పై మోదీ కీలక విమర్శలు చేశారు. వందశాతం నిజం మాట్లాడేందుకు తాను ఇక్కడికి వచ్చినట్లు మోదీ పేర్కొన్నారు. తన కళ్లల్లోకి చూసే ధైర్యం కేసీఆర్‌కు లేదని ప్రధాని మోదీ ఘాటు స్పందించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ దిల్లీకి వచ్చినట్లు, ఎన్డీఏలో చేరతానని తనను అడిగారని మోదీ చెప్పారు. అలసిపోయానని, కేటీఆర్‌కు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తానని కేసీఆర్ తనతో అన్నారని మోదీ వివరించారు. అయితే తాను ఇది రాచరికం కాదని చెప్పానని మోదీ అన్నారు. అధికారంలో ఎవరు ఉండాలనేది ప్రజలే నిర్ణయిస్తానని తాను కేసీఆర్‌కు చెప్పినట్లు వెల్లడించారు.
ఇద్దరం గుజరాతీలమే: మోదీ
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. నాడు గుజరాత్‌కు చెందిన సర్దార్ పటేల్ నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించారని అన్నారు. ఇప్పుడు మరో గుజరాతీ అయిన తాను తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చేప్పారు. తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణలో టాలెంట్‌కు కొదవలేదన్నారు. కరోనా కాలంలో ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత తెలంగాణకే దక్కుతుందని మోదీ అన్నారు. నేడు ప్రారంభించిన ఎన్టీపీసీ వల్ల తెలంగాణకే ఎక్కువ ఉపయోగం జరగుతుందన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాకుండా కాంగ్రెస్ కుట్ర చేసింది: మోదీ
దేశం మొత్తం కాంగ్రెస్‌ను తిరస్కరించినట్లు మోదీ పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ నేతలే డబ్బులు అందజేశాని విమర్శించారు. మహిళా బిల్లుపై కూడా మోదీ మాట్లాడారు. ప్రతిపక్షాల ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాకుండా కుట్ర చేసినట్లు మోదీ ఆరోపించారు. ఒకవైపు బిల్లుకు మద్దతు తెలుపుతూనే, మరోవైపు కుట్రలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. చివరికి గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చినట్లు మోదీ అన్నారు.