LOADING...
KCR oath: ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 
KCR oath: ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

KCR oath: ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 

వ్రాసిన వారు Stalin
Feb 01, 2024
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

BRS supremo KCR oath: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తన చాంజర్‌లో గజ్వేల్‌ ఎమ్మెల్యేగా కేసీఆర్‌‌తో ప్రమాణం చేయించారు. అంతకుముందు, కేసీఆర్‌ అసెంబ్లీకి చేరుకోగా.. కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో కింద పడిపోవడంతో.. తుంటి విరిగింది. ఆ తర్వాత తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరగడం వల్ల డిసెంబర్ 9న మిగిలిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ ప్రమాణంస్వీకారం చేయలేకపోయారు. లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్న నేపథ్యంలో.. కేసీఆర్ అసెంబ్లీకి రావడం పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని నింపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాణస్వీకారం చేస్తున్న కేసీఆర్