Page Loader
KCR : కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ భేటీ.. పొత్తు కోసమేనా! 
KCR : కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ భేటీ.. పొత్తు కోసమేనా!

KCR : కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ భేటీ.. పొత్తు కోసమేనా! 

వ్రాసిన వారు Stalin
Mar 05, 2024
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ ఎన్నికల వేళ.. తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం భేటీ అయ్యారు. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో వీళ్ల భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలుత ప్రవీణ్‌కుమార్‌ బీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నమ్మొద్దని ప్రవీణ్‌కుమార్‌ ట్వీట్ చేశారు. అందులో వాస్తవం లేదని ఈరోజు ఉదయం ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ట్వీట్ చేసిన కొన్ని గంటలకు ఆయన కేసీఆర్‌ను కలవడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-బీఎస్పీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆ పొత్తులో భాగంగా నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ బరిలో ప్రవీణ్‌కుమార్‌ నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేసీఆర్‌తో ఆర్ఎస్ కుమార్