LOADING...
Uttarpradesh: సీబీఐ విచారణకు డుమ్మా కొట్టనున్నఅఖిలేష్ యాదవ్ 
Uttarpradesh: సీబీఐ విచారణకు డుమ్మా కొట్టనున్నఅఖిలేష్ యాదవ్

Uttarpradesh: సీబీఐ విచారణకు డుమ్మా కొట్టనున్నఅఖిలేష్ యాదవ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 29, 2024
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గురువారం ఢిల్లీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)సమన్లను దాటవేసే అవకాశం ఉందని సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో 2012 నుంచి 2016 వరకు జరిగిన అక్రమ మైనింగ్ కేసులో సాక్షిగా తన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని సీబీఐ బుధవారం యాదవ్‌కు నోటీసు జారీ చేసింది. అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ అధికారులు ఈ-టెండరింగ్ ప్రక్రియకు విరుద్ధంగా మైనింగ్ లీజులను మంజూరు చేయడం ద్వారా అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారని సిబిఐ ఆరోపించింది. ముఖ్యంగా 2013 ఫిబ్రవరి 17న ఈ-టెండరింగ్ నిబంధనలను ఉల్లంఘించి ఒకేరోజు 13 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతి లభించిందని ఏజెన్సీ ఆరోపిస్తోంది.

Details 

సీబీఐ సమన్లపై స్పందించిన అఖిలేష్

2012-13లో యాదవ్ మైనింగ్ పోర్ట్‌ఫోలియోను నిర్వహించారు. సీబీఐ సమన్లపై స్పందించిన అఖిలేష్ యాదవ్ ఎన్నికలు వ‌చ్చినప్పుడల్లా తనకు నోటీసులొస్తాయన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల వేళా కూడా ఇలాగే జరిగిందన్నారు. బీజేపీ ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నది తమ పార్టీనే అన్నారు. ఈ కేసుకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో నేరపూరిత కుట్ర, దొంగతనం, దోపిడీ, మోసం, నేరాలకు పాల్పడే ప్రయత్నం, దుష్ప్రవర్తన వంటి అభియోగాలు ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించినప్పటికీ అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు దోహదపడినందుకు 11 మంది పేర్లను నమోదు చేశారు. 2016లో అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.