
Akhilesh Yadav-Amit Shah: బీజేపీ అధ్యక్ష ఎన్నికపై అఖిలేశ్ యాదవ్ సెటైర్.. దీటుగా బదులిచ్చిన అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
వక్ఫ్ సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరస్పరం వ్యంగ్య వ్యాఖ్యలు చేసుకున్నారు.
బీజేపీ అధ్యక్ష ఎన్నిక గురించి అఖిలేశ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించగా, అమిత్ షా కూడా దీటుగా ప్రత్యుత్తరం ఇచ్చారు.
అసలు ఏం జరిగింది అంటే...?
వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, "ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ తన అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతుంది" అంటూ బీజేపీపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
వివరాలు
ఐదుగురి నుంచే మీ పార్టీ అధ్యక్షుడు
దీనికి అమిత్ షా స్పందిస్తూ, "అఖిలేశ్‌జీ నవ్వుతూ ఒక విషయం చెప్పారు, నేను కూడా నవ్వుతూనే సమాధానం ఇస్తాను. కొన్ని పార్టీల నాయకత్వం ఐదుగురి చేతుల్లోనే ఉంటుంది, అందుకే వాళ్లు అధ్యక్షుడిని వెంటనే ఎన్నుకోవచ్చు. కానీ మేము విధివిధానాలను అనుసరించాలి. మా పార్టీకి 12 నుంచి 13 కోట్ల సభ్యులున్నారు, అందులో ఒకరిని ఎంపిక చేయడానికి కొంత సమయం పడుతుంది. అయితే, మీ విషయంలో మాత్రం అంత సమయం అవసరం లేదు, ఎందుకంటే మరొక 25 ఏళ్లు మీరే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు, మీ దగ్గర ఎలాంటి మార్పు ఉండదు" అంటూ గట్టిగా సమాధానం ఇచ్చారు.