Page Loader
JP Narayan Centre row: సమాజ్‌వాదీ శ్రేణుల ఆందోళన..లక్నోలో ఉద్రిక్తత
సమాజ్‌వాదీ శ్రేణుల ఆందోళన..లక్నోలో ఉద్రిక్తత

JP Narayan Centre row: సమాజ్‌వాదీ శ్రేణుల ఆందోళన..లక్నోలో ఉద్రిక్తత

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2024
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని జయప్రకాష్‌ నారాయణ్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ (జేపీఎన్‌ఐసీ) వద్ద సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) నేతలు ఆందోళన చేపట్టారు. జయప్రకాష్‌ నారాయణ్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌కు తనను వెళ్లనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సమాజ్‌వాది కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శుక్రవారం (అక్టోబర్‌ 11) జయప్రకాష్‌ నారాయణ్‌ జయంతి సందర్భంగా గురువారం రాత్రి అఖిలేష్‌ యాదవ్‌ జేపీఎన్‌ఐసీని సందర్శించారు.

వివరాలు 

సెంటర్‌ మెయిన్‌ గేట్‌ వద్ద బారికేడ్లు 

అక్కడ మెయిన్‌ గేట్‌ వద్ద పోలీసులు రెండు అడ్డుతెరలు ఏర్పాటు చేయడంపై అఖిలేష్‌ మండిపడ్డారు. ఆయన ప్రభుత్వం ఏదో దాచడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ఘటనపై సమాజ్‌వాది శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో, లక్నోలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. శుక్రవారం జేపీఎన్‌ఐసీకి వెళ్లే దారిలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సెంటర్‌ మెయిన్‌ గేట్‌ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.