తదుపరి వార్తా కథనం

SP Maurya: సమాజ్ వాదీ పార్టీకి ఎస్పీ మౌర్య రాజీనామా
వ్రాసిన వారు
Stalin
Feb 20, 2024
02:17 pm
ఈ వార్తాకథనం ఏంటి
స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్‌వాదీ పార్టీతో తన సంబంధాన్ని పూర్తిగా తెంచుకున్నారు.
ఫిబ్రవరి 13న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన ఆయన మంగళవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కూడా రిజైన్ చేశారు.
స్వామి ప్రసాద్ మౌర్య తన రాజీనామా విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' ద్వారా తెలియజేశారు.
సొంతంగా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు స్వామి ప్రసాద్ మౌర్య సోమవారం వెల్లడించారు. ఈ మేరకు పార్టీ జెండాను కూడా విడుదలు చేశారు.
సోషలిస్టు భావజాలానికి విరుద్ధంగా అఖిలేష్ యాదవ్ వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా స్వామి ప్రసాద్ మౌర్య మండిపడ్డారు.
ఫిబ్రవరి 22న దిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కార్మికులతో సమావేశం కానున్నట్టు మౌర్య తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎస్పీ మౌర్య ట్వీట్
संज्ञानार्थ,@yadavakhilesh pic.twitter.com/C3RnzRnrPU
— Swami Prasad Maurya (@SwamiPMaurya) February 20, 2024