Page Loader
UP: యూపీలో కాంగ్రెస్‌కు 15 సీట్లు ఇవ్వడానికి అఖిలేష్ సిద్ధం!
UP: యూపీలో కాంగ్రెస్‌కు 15 సీట్లు ఇవ్వడానికి అఖిలేష్ సిద్ధం!

UP: యూపీలో కాంగ్రెస్‌కు 15 సీట్లు ఇవ్వడానికి అఖిలేష్ సిద్ధం!

వ్రాసిన వారు Stalin
Feb 19, 2024
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా 28 ప్రతిపక్ష పార్టీలతో 'ఇండియా' కూటమి ఏర్పడింది. అయితే కూటమిలో సీట్ల పంపకాలు కొలిక్కి రాకపోవడంతో కొన్ని పార్టీలు 'ఇండియా' నుంచి వైదొలిగాయి. మరికొన్ని పార్టీలు కూటమిలో ఉంటూనే స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈక్రమంలో యూపీలో కాంగ్రెస్‌తో సీట్ల పంపకంపై స‌మాజ్‌వాదీ పార్టీ కీలక ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు గాను 15 సీట్లను కాంగ్రెస్‌‌కు ఇస్తామని ఎస్పీ చీఫ్ అఖిలేష్‌ యాదవ్‌ తెలిపినట్లు సమాచారం. ఇండియా కూటమి నుంచి ఆర్ఎల్‍‌డీ వెళ్లిన తర్వాత యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో అఖిలేష్‌ సీట్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్

రాహుల్ గాంధీ యాత్రలో అఖిలేష్ యాదవ్

2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దేశం మొత్తం 52 సీట్లను మాత్రమే గెలుచుకుంది. యూపీలో ఒక్క రాయ్‌బరేలీలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. రాహుల్ గాంధీ స్వయంగా అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. 2019లో అమేథీ, రాయ్‌బరేలీలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఎస్పీ తన అభ్యర్థులను నిలబెట్టలేదు. అయితే కాంగ్రెస్‌కు ఎస్పీ ఆఫర్ చేస్తున్న 15సీట్లలోనే అమేథీ, రాయ్‌బరేలీ కూడా ఉండనున్నాయి. అలాగే కాంగ్రెస్ 15 సీట్లకు మించి అభ్యర్థులను నిలబెట్టొందని ఎస్పీ షరతు విధించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో అఖిలేష్ యాదవ్ పాల్గొంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సోమవారం ప్రకటించారు.