NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్
    తదుపరి వార్తా కథనం
    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్
    యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్

    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్

    వ్రాసిన వారు Stalin
    Feb 25, 2023
    06:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2005లో హత్యకు గురైన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజుపాల్ కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్‌ను ప్రయాగ్‌రాజ్‌లో శుక్రవారం దుండగులు హతమార్చారు. ఈ అంశంపై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మధ్య డైలాగ్ వార్ నడిచింది.

    మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ తమ్ముడు ఖలీద్ అజీమ్‌ను ఓడించి అలహాబాద్ (పశ్చిమ) అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి రాజు పాల్ ఎమ్మెల్యేగా గెలిచారు. కొన్ని నెలలకే రాజు పాల్ హత్యకు గురయ్యారు రాజుపాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు, మాజీ ఎమ్మెల్యే అష్రఫ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. నిందితులంతా ప్రస్తుతం జైలులో ఉన్నారు.

    ఉత్తర్‌ప్రదేశ్

    సమాజ్‌వాదీ పార్టీ నేరస్థులను ప్రోత్సహిస్తోంది: సీఎం యోగి

    ఇప్పుడు ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్‌ను కాల్చి చంపడంపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణిస్తోంది. ఈ కాల్పుల ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలపై అసెంబ్లీలో అఖిలేష్ ప్రశ్నించారు.

    ఈ మేరకు స్పందించిన సీఎం ఆదిత్యనాథ్, ఎస్పీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ నేరస్థులను ప్రోత్సహిస్తోందన్నారు. వారికి పూలమాలలతో స్వాగతం పలుకున్నారని దుయ్యబట్టారు. ఆపై రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై డ్రామా సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    మాజీ ఎంపీ అతిక్ అహ్మద్‌కు ఎస్పీ మద్దతిచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు సీఎం యోగి రాష్ట్రంలోని అన్ని మాఫియాలను తమ ప్రభుత్వం అంతం చేస్తుందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యోగి ఆదిత్యనాథ్
    అఖిలేష్ యాదవ్
    ఉత్తర్‌ప్రదేశ్
    సమాజ్‌వాదీ పార్టీ/ ఎస్పీ

    తాజా

    Operation Sindoor: 'మా యుద్ధవిమానం నేలకూలింది'.. పాకిస్థాన్  పాకిస్థాన్
    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌

    యోగి ఆదిత్యనాథ్

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఉత్తర్‌ప్రదేశ్

    అఖిలేష్ యాదవ్

    కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    ఉత్తర్‌ప్రదేశ్

    కృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా మసీదు వివాదాస్పదంలో సర్వేకు కోర్టు ఆదేశం భారతదేశం
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు దిల్లీ
    ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ నరేంద్ర మోదీ
    డోలో-650 తయారీదారుపై ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణ, అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ హైకోర్టు

    సమాజ్‌వాదీ పార్టీ/ ఎస్పీ

    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం బీబీసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025