Page Loader
Rajya Sabha Election: రాజ్యసభ పోలింగ్ వేళ.. ఎస్పీ చీప్ విప్ పదవికి మనోజ్ పాండే రాజీనామా
Rajya Sabha Election: రాజ్యసభ పోలింగ్ వేళ.. ఎస్పీ చీప్ విప్ పదవికి మనోజ్ పాండే రాజీనామా

Rajya Sabha Election: రాజ్యసభ పోలింగ్ వేళ.. ఎస్పీ చీప్ విప్ పదవికి మనోజ్ పాండే రాజీనామా

వ్రాసిన వారు Stalin
Feb 27, 2024
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజ్యసభ పోలింగ్ వేళ.. సమాజ్‌వాదీ పార్టీకి (ఎస్పీ) భారీ షాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా యూపీలోని 10 స్థానాలకు సోమవారం ఉదయం 9గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఒకవైపు రాజ్యసభకు పోలింగ్ జరగుతుండగా.. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌విప్‌ మనోజ్‌ పాండే తన పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారం ఎస్పీని షాక్‌కు గురి చేయగా.. యూపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రాజీనామా అనంతరం మనోజ్ పాండే స్పందిస్తూ.. తాను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడినట్లు చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం తాను సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అవుతానని వెల్లడించారు.

 యూపీ

ఎనిమిదో సీటు కోసం బీజేపీ వ్యూహం

మనోజ్ పాండే బీజేపీ అనుకూలంగా మారడంలో యూపీ మంత్రి దయాశంకర్ సింగ్ కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. సోమవారం (ఫిబ్రవరి 26) అర్థరాత్రి వరకు పలువురు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలతో దయాశంకర్ సింగ్ సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఈ క్రమంలో కొందరు మనోజ్ పాండే సహా మరికొంత మంది ఎస్పీ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు. మొత్తం 10స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం బీజేపీకి 7 సీట్లు, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) 3సీట్లను గెలువొచ్చు. అయితే బీజేపీ అనూహ్యంగా 8మందిని బరిలోకి దింపింది. ఎనిమిదో అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఎస్పీ ఎమ్మెల్యేలను తమ వైపు ఆకర్షించడంతో బీజేపీ దాదాపు సఫలీకృతమైనట్లే కనిపిస్తోంది.