Page Loader
జీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్ 
జీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్

జీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్ 

వ్రాసిన వారు Stalin
Aug 19, 2023
06:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని చెంబుతున్న కేంద్రం ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో జీ20 ఈవెంట్‌ను ఎందుకు నిర్వహించడం లేదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో చాలా జీ20 ఈవెంట్‌లు జరిగాయాని, కానీ మణిపూర్‌లో ఎందుకు నిర్వహించలేదని అడిగారు. దిల్లీలో జరిగే కార్యక్రమాలతో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే మణిపూర్‌లో పెద్ద సమస్య ఉందన్న విషయాన్ని కేంద్రం మర్చిపోకూడదని అఖిలేష్ యాదవ్ అన్నారు. దమ్ముంటే మణిపూర్‌లో జీ20 సమావేశం నిర్వహించి పరిస్థితి బాగానే ఉందని ప్రపంచానికి చూపించాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

యూపీ

వారసత్వ రాజకీయాలపై బీజేపీకి అఖిలేష్ కౌంటర్ 

విపక్ష కూటమి 'ఇండియా' ప్రధాని నరేంద్ర మోదీ 'ఘమండియా' (అహంకారంతో నిండినది)గా ప్రధాని మోదీ అభివర్ణించారు. అయితే ప్రధాని వ్యాఖ్యలపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఇండియా కూటమిని 'ఘమండియా' అని పిలిచే వారే నిజమైన అహంకారులు అన్నారు. వంశపారంపర్య రాజకీయాలపై మోదీ చేసిన విమర్శలపై కూడా అఖిలేష్ స్పందించారు. జ్యోతిరాదిత్య సింధియా రాజవంశం కాదా? అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి వచ్చింది వారసత్వ రాజకీయాల నుంచి కాదా? అని అడిగారు. తాను కేవలం ఇద్దరి పేర్లను ప్రస్తావించానని చెప్పారు. అయితే ఎంపీలు ఎన్నుకోబడతారని, నామినేట్ చేయబడరని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద వంశపారంపర్య రాజకీయ పార్టీ బీజేపీ అని అఖిలేష్ యాదవ్ చెప్పారు.