Page Loader
Akhilesh Yadav: కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుంది: అఖిలేష్ యాదవ్ 
Akhilesh Yadav: కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుంది: అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుంది: అఖిలేష్ యాదవ్ 

వ్రాసిన వారు Stalin
Feb 21, 2024
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌- సమాజ్ వాదీ పార్టీ పొత్తు వీగిపోతుందన్న ప్రచారం నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్‌తో పొత్తు ఖాయమని అఖిలేష్ యాదవ్ అన్నారు. త్వరలోనే సీట్ల పంపకంపై క్లారిటీ ఇస్తామని పేర్కొన్నారు. త్వరలోనే సీట్ల పంపకంపై క్లారిటీ ఇస్తామని పేర్కొన్నారు. రానున్న కాలంలో యూపీలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని ఎస్పీ చీఫ్ స్పష్టం చేశారు. సీట్ల పంపకాల విషయంలో ఎలాంటి వివాదాలు లేవన్నారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని అఖిలేష్ యాదవ్ చెప్పారు.

యూపీ

కాంగ్రెస్‌కు 17-19 సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకారం

అమేథీ, రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'కు ఎందుకు గైర్హాజరయ్యారని విలేకరులు అడిగిన ప్రశ్నకు అఖిలేష్ యాదవ్ ఈ విధంగా సమాధానం చెప్పారు. రాహుల్ గాంధీతో అంతా బాగానే ఉందని, ఎలాంటి వివాదం లేదని, పొత్తు ఉంటుందని పేర్కొన్నారు. సీట్ల పంపకం ఖరారైన తర్వాతే రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొంటానని ఇంతకుముందే అఖిలేష్ చెప్పిన సంగతి తెలిసిందే. పొత్తును అధికారికంగా ప్రకటించేందుకు ఇరు పార్టీల రాష్ట్ర యూనిట్లు త్వరలో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 17-19 సీట్లు ఇచ్చేందుకు సమాజ్‌వాదీ పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది.