తదుపరి వార్తా కథనం

CBSE Class 10 results: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకొండి ఇలా..
వ్రాసిన వారు
Sirish Praharaju
May 13, 2025
01:35 pm
ఈ వార్తాకథనం ఏంటి
సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల ఫలితాలను అధికారులు ప్రకటించారు.
ఈ సంవత్సరం మొత్తం ఉత్తీర్ణత శాతం 93.66%గా నమోదైంది. గత సంవత్సరం అయిన 2024లో ఈ శాతం 93.60%గా ఉండగా, తాజా ఫలితాల్లో స్వల్పంగా మెరుగుదల కనిపిస్తుంది.
మొత్తం 23,71,939 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 22,21,636 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లైన cbse.gov.in, cbseresults.nic.in, results.cbse.nic.in లో చెక్ చేసుకోవచ్చు.