Loading...
Census 2027: దేశంలో తొలిసారి సమగ్ర కులగణన.. 40 ప్రశ్నలకు కేంద్రం ఆమోదం
దేశంలో తొలిసారి సమగ్ర కులగణన.. 40 ప్రశ్నలకు కేంద్రం ఆమోదం

Census 2027: దేశంలో తొలిసారి సమగ్ర కులగణన.. 40 ప్రశ్నలకు కేంద్రం ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 14, 2026
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో 2027 జనాభా లెక్కల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా జనగణన మొదటి దశలో ప్రజలను అడగాల్సిన 40 ప్రశ్నలను కేంద్రం నోటిఫై చేసింది. ఈసారి జనాభా లెక్కల్లో కులానికి సంబంధించిన వివరాలను కూడా సేకరించనున్నారు. అలాగే షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) వివరాలతో పాటు కోవిడ్-19 వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా నమోదు చేయనున్నారు. కులం వివరాల సేకరణ రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. జనగణనలో ప్రతి వ్యక్తి షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగకు చెందినవారా? అనే వివరాలను నమోదు చేయనున్నారు. దీంతో పాటు వారి కులం ఏమిటనే సమాచారాన్ని కూడా సేకరిస్తారు.

వివరాలు 

కోవిడ్ వ్యాక్సిన్‌పై కూడా ప్రశ్న

దేశవ్యాప్తంగా సమగ్ర స్థాయిలో కులానికి సంబంధించిన సమాచారాన్ని జనాభా లెక్కల ద్వారా సేకరించడం ఇదే తొలిసారి కానుంది.

2027 జనగణనలో మరో కీలక అంశంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ వివరాలు నిలవనున్నాయి.

ప్రజలు కోవిడ్ టీకాను ఎక్కడ తీసుకున్నారనే విషయాన్ని కూడా అడిగి నమోదు చేయనున్నారు.

జనాభా లెక్కల్లో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం ఈసారి ప్రత్యేకంగా మారింది.

మంచు ప్రాంతాల్లో ముందుగానే జనగణన

మంచుతో కప్పబడి ఉండే, ఎగుడుదిగుడుగా ఉండే ప్రాంతాల్లో జనగణన ప్రక్రియను ముందుగానే చేపట్టనున్నారు.

లడఖ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని ఎంపిక చేసిన మంచు ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జనగణన నిర్వహిస్తారు.

వివరాలు 

మిగతా ప్రాంతాల్లో 2027 ఫిబ్రవరిలో..

ఈ ప్రక్రియకు ముందు ఆగస్టు 17 నుంచి 31 వరకు ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.

దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కలు నిర్వహించనున్నారు.

ఈసారి జనగణనను రెండు దశల్లో చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది.

మొదటి దశలో ఇళ్లు, గృహాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తారు.

రెండో దశలో ప్రతి వ్యక్తికి సంబంధించిన జనాభా, సామాజిక, ఆర్థిక వివరాలను నమోదు చేస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

తొలిసారి పూర్తిగా డిజిటల్ విధానంలో..

2027 జనాభా లెక్కలు దేశంలో నిర్వహించనున్న 16వ జనగణన కాగా.. స్వాతంత్ర్యం తర్వాత చేపడుతున్న ఎనిమిదో జనగణన కానుంది.

ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనుండటం మరో ప్రత్యేకత. మొబైల్ పరికరాల ద్వారా సమాచారాన్ని సేకరించనున్నారు.

అవసరమైన ప్రాంతాల్లో డేటాను మాన్యువల్‌గా నమోదు చేసుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంచనున్నారు.

2021లో వాయిదా పడిన జనగణన

కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు వాయిదా పడ్డాయి.దీంతో 2027లో నిర్వహించనున్న జనగణనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

ఈసారి కులం,ఎస్సీ,ఎస్టీ వివరాలతో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ సమాచారం కూడా జనగణనలో భాగం కానుంది.

దీనికి తోడు డిజిటల్ విధానంలో డేటా సేకరణ చేపట్టడం కూడా 2027 జనగణనలో కీలక మార్పుగా నిలవనుంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దేశంలో తొలిసారి సమగ్ర కులగణన

ADVERTISEMENT