NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kazipet Railway Coach: తెలంగాణకు మరో విభజన హామీని నెరవేర్చిన కేంద్రం.. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్
    తదుపరి వార్తా కథనం
    Kazipet Railway Coach: తెలంగాణకు మరో విభజన హామీని నెరవేర్చిన కేంద్రం.. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్
    కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్

    Kazipet Railway Coach: తెలంగాణకు మరో విభజన హామీని నెరవేర్చిన కేంద్రం.. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 29, 2024
    09:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.

    విభజన హామీల్లో భాగంగా, కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయూ) ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    కాజీపేటలోని వ్యాగన్ ఫ్యాక్టరీని అప్‌గ్రేడ్ చేయాలని సెంట్రల్ రైల్వే ఆదేశాలు జారీ చేసింది.

    ఈ ప్రక్రియకు సంబంధించి దక్షిణమధ్య రైల్వే జీఎంకు గత ఏడాది జులై 5వ తేదీన అప్‌గ్రేడ్ చేసే ఆదేశాలు అందాయి.

    వివరాలు 

    ఎల్‌హెచ్‌బి, ఈఎంయు కోచ్‌ల తయారీ.. 

    ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌ 9న, రైల్వే బోర్డు అప్‌గ్రేడ్ చేసిన యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌ల తయారీకి అనుగుణంగా సౌకర్యాలను అభివృద్ధి చేయాలని సూచించింది.

    కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఈ కోచ్‌ల తయారీకి అవసరమైన విధానాలను రూపొంపేందుకు ప్రణాళికలు రూపొందించాలని కూడా రైల్వే బోర్డు సూచించింది.

    ఈ విషయం ఇటీవల తెలంగాణ హోంశాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో జరిగిన సమావేశంలో వెల్లడి అయ్యింది.

    వివరాలు 

    60,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు 

    కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు, ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారు.

    2014లో ఏపీ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఈ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది.

    2023లో వ్యాగన్ తయారీ పరిశ్రమ పై ప్రకటన అయితే చేసింది, కానీ అది ఆచరణలోకి రాలేదు.

    ఇక, దక్షిణ భారతదేశానికి ప్రధాన గేట్‌వే అయిన కాజీపేట జంక్షన్‌ను డివిజన్‌గా ఏర్పరచాలని స్థానికులు, కార్యకర్తలు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు.

    ఉత్తర, దక్షిణ ధృవాలను అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషించే కాజీపేట జంక్షన్ డివిజన్‌గా ఏర్పడితే దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కలుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా

    తెలంగాణ

    Ramagundam: రామగుండంలో సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు.. రూ.29,344 కోట్లతో అంగీకారం రామగుండం
    Samagra Kutumba Survey: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం.. 75 ప్రశ్నలతో డేటా సేకరణ! ఇండియా
    CM Revanth Reddy: ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్.. విద్యార్థులతో ముఖాముఖి  రేవంత్ రెడ్డి
    green pharmacity: గ్రీన్‌ ఫార్మాసిటీలో భారీ పెట్టుబడులు పెట్టనున్న అయిదు దిగ్గజ ఫార్మా కంపెనీలు భారతదేశం

    కేంద్ర ప్రభుత్వం

    AP-Telangana:తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం  భారతదేశం
    AP Rains: ఏపీకి భారీ నష్టం..6,880 కోట్లు ఇవ్వండి.. అధికారిక లెక్కలివిగో...! ఆంధ్రప్రదేశ్
    Adhaar-style IDs: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. అక్టోబరు నుంచి ఆధార్ తరహా ఐడీల నమోదు ప్రారంభం బిజినెస్
    Toll collection: టోల్ ప్లాజాల వద్ద.. GNSS ఆధారిత టోల్ విధానం బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025