తదుపరి వార్తా కథనం

Chandrababu: సోలార్ విద్యుత్ సరఫరా.. పైలట్ ప్రాజెక్టుగా కుప్పం నియోజకవర్గం
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 25, 2024
03:20 pm
ఈ వార్తాకథనం ఏంటి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో ప్రధానంగా చర్చించారు.
పీఎం సూర్య ఘర్ కార్యక్రమం, ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ పరికరాల ఏర్పాటుపై సమీక్ష చేపట్టారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన గృహాలకు సౌర విద్యుత్ అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆలోచనలు వెల్లడించారు.
కుసుమ్ పథకం, సోలార్ విలేజ్ వంటి ముఖ్యమైన అంశాలపై కూడా ఆయన పరిశీలన జరిపారు.
ఇక 100 శాతం సౌర విద్యుత్ సరఫరా లక్ష్యంతో కుప్పం నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా గుర్తించామని సీఎం తెలిపారు.
ఈ దిశగా అధికారులకు వివిధ సూచనలు చేసి, అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు.