2022 లో IRDAI తీసుకున్న సానుకూల మార్పులు
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI), 2022లో పలు ప్రయోజనం చేకూర్చే సానుకూల నిర్ణయాలను తీసుకుంది. '2047 నాటికి అందరికీ బీమా' అనే దృక్పథంతో IRDAI అనేక సంస్కరణలు చేసింది. మొదటిది ఆరోగ్య బీమా పాలసీ సంస్థల కోసం 'యూజ్ అండ్ ఫైల్' విధానం. రెగ్యులేటర్ నుండి ఆమోదం తీసుకోకుండానే కొత్త పాలసీలను ప్రవేశపెట్టడానికి IRDAI వీలు కల్పించింది. మోటారు బీమాను మరింత మందికి చేరువ చేసే ప్రయత్నంలో, IRDAI మైలేజ్, నాణ్యతతో అనుసంధానించబడిన ప్రీమియంలతో 'పే యాస్ యు డ్రైవ్ (PAYD)' & 'పే హౌ యు డ్రైవ్' మోటారు బీమా పాలసీలను ప్రారంభించేందుకు బీమా సంస్థలను అనుమతించింది.
బీమా సుగమ్ వంటి ప్రయోజనాత్మక పోర్టల్ ను ప్రారంభించిన IRDAI
బీమా సుగమ్, అమెజాన్ లాంటి వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ వంటిది. అన్ని ఆరోగ్య, జీవిత బీమా పాలసీలు, ఇతర పాలసీలు ఇక్కడే ఉంటాయి. పాలసీ కొనుగోలు నుండి క్లెయిమ్ సెటిల్‌మెంట్ వరకు అన్ని బీమా అవసరాలకు వన్-స్టాప్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌గా ఉపయోగపడుతుంది ఒపిడి సేవలకు, ఫార్మసి ఖర్చులకు కూడా పాలసీలు వర్తించేలా కొన్ని భీమా సంస్థలు కొన్ని కొత్త పాలసీలు ప్రవేశపెట్టాయి. జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్ అంటే పాలసీదారు పాలసీ కాలపరిమితికి ముందే పాలసీ నుండి బయటికి వచ్చే అవకాశం కల్పిస్తుంది. జనవరి 1, 2023 నుండి కొనుగోలు చేసే అన్నీ పాలసీలకు KYC తప్పనిసరి చేసింది. పాలసీదారు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా KYC పత్రాలు సమర్పించాలి.