తదుపరి వార్తా కథనం

Chandrababu: ప్రధాని మోదీ, అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 25, 2024
05:36 pm
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార నివాసంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కలిశారు.
ఈ సమావేశంలో, రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులపై చర్చ జరిగింది. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుని, ప్రధానమంత్రి మోడీతో భేటీ అయ్యారు.
ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చ జరిగింది.
Details
సాయంత్రం 6:30 గంటలకు నిర్మలా సీతారామన్ తో భేటీ
ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు.
ఆ తర్వాత, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా ఆయన భేటీ అవుతారు.
ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.