Page Loader
CM Chandrababu: తెలుగు ప్రజలందరికి కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు
తెలుగు ప్రజలందరికి కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: తెలుగు ప్రజలందరికి కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2025
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. "కమ్మని విందుల కనుమ పండుగ మీ కుటుంబంలో సంతోషం నింపాలి. వ్యవసాయదారుల జీవితాలతో విడదీయరాని అనుబంధం కలిగిన పశుసంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుంది. కాలం మరినా తరగని అనుబంధాల సంపద మనది. ఆ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మరొక్కమారు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను" అని సీఎం చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంద్రబాబు చేసిన ట్వీట్ 

వివరాలు 

నారా వంశీకులు నాగాలమ్మకు ప్రత్యేక పూజలు

ఈ నేపథ్యంలో,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం నారా వంశీకులు నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు,నారా లోకేశ్, భువనేశ్వరి,బ్రాహ్మిని,దేవాన్ష్,ఎంపీ భరత్,ఆయన సతీమణి తేజస్విని తదితరులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. నాగాలమ్మ పూజల అనంతరం తీర్థప్రసాదాలను కుల పెద్దలు అందజేశారు. నారా భువనేశ్వరి,బ్రాహ్మిని ఇతర మహిళలతో కలిసి నాగాలమ్మ పుట్ట వద్ద నూలుపోగులు చుట్టి పాలను నైవేద్యంగా సమర్పించారు. పూజల సమయంలో చంద్రబాబు మనవళ్లతో గడిపారు. ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ,ఈ పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. పల్లెలు పాడిపంటలతో కళకళలాడాలని,ఎంత ఎదిగినా మూలాలు,సంప్రదాయాలను మరిచిపోకూడదని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

ఖర్జూర నాయుడు, అమ్మనమ్మ సమాధులకు నివాళి

అనంతరం, చంద్రబాబు ఊరి పెద్దలతో ముచ్చటించారు. నాగ దేవతల ప్రసాదాలను నారా, నందమూరి కుటుంబ సభ్యులు స్వీకరించారు. తన తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు, అమ్మనమ్మ సమాధుల వద్దకు చేరుకుని నివాళి అర్పించారు. అనంతరం నారావారిపల్లిలోని తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను ఆవిష్కరించారు.