తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయాన్ని సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు.
తొలుత సీఎం కేసీఆర్, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వీ.ప్రశాంత్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి పూజలు నిర్వహించారు.
సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొని మధ్యాహ్నం 1.20 గంటలకు నూతన భవన ప్రారంభోత్సవాన్ని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం రిబ్బన్ కటింగ్ చేసి సీఎం కేసీఆర్ అధికారికంగా నూతన సచివాలయ భవనంలోకి ప్రవేశించారు.
ఆ తర్వాత ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్, తన సీటులో కూర్చొని, అధికారికంగా కార్యకలాపాలను ప్రారంభించారు.
అంతకుముందు ఎలక్ట్రిక్ వాహనంలో ముఖ్యమంత్రి సచివాలయంలో కలియ తిరిగారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నూతన సచివాలయంలోకి ప్రవేశించిన సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు
Join us as we witness history in the making! Watch Live: Inauguration Ceremony of Dr. B.R. Ambedkar Telangana State Secretariat. #PrideOfTelangana https://t.co/JTbnKopdez
— BRS Party (@BRSparty) April 30, 2023