Page Loader
హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన 
హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన 

వ్రాసిన వారు Stalin
Jun 05, 2023
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న 'భారత్ భవన్' సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్‌కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో దాదాపు 11ఎకరాల్లో 15అంతస్తుల్లో 'భారత్ భవన్'‌ను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చండీహోమంలో పాల్గొని పూర్ణాహుతి చేశారు. అనంతరం ఆయన మొక్కలు నాటారు. బీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. ఇప్పటికే దిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయాన్ని, అనేక ఇతర రాష్ట్రాల్లో రాష్ట్ర కార్యాలయాలను బీఆర్ఎస్ ప్రారంభించుకున్నది. ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా హైదరాబాద్‌లో అత్యాధునిక పరిశోధన, శిక్షణా సంస్థ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

తెలంగాణ

దేశంలోని బీఆర్ఎస్ కార్యకలాపాలన్ని ఇక్కడి నుంచే 

'భారత్‌ భవన్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌' కేంద్రంగా రాజకీయ అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతులు నిర్వహించి కార్మికులు, నాయకులకు సమగ్ర సమాచారం అందించనున్నారు. తొలిదశలో 15 అంతస్తుల భవన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఈ కేంద్రం పార్టీ కార్యకర్తలకు సమగ్ర శిక్షణా సౌకర్యంగా పని చేస్తుంది. వారికి దేశం నలుమూలల నుంచి సమాచారాన్ని చేరవేస్తుంది. ఇందులో విశాలమైన సమావేశ మందిరాలు, అత్యాధునిక డిజిటల్ లైబ్రరీ, బహుభాషా వార్తాపత్రికలు, వార్తల సేకరణ సేవలు, పార్టీ నేతలకు అవసరమైన సమాచారాన్ని అందించడం వంటివి ఉంటాయి. ట్రైనీలు ఉండేందుకు అవసరమైన వసతిని ఇందులోనే కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాత సంస్థల్లో పనిచేసిన అనుభవజ్ఞులైన నిపుణులను శిక్షణ, పరిశోధన కార్యక్రమాలను నిర్వహించడానికి నియమిస్తారు.