New Liquor Brands: మద్యం కంపెనీల అనుమతులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త మద్యం బ్రాండ్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చే విధానాన్ని పారదర్శకంగా మార్చాలని ఆదేశాలు జారీ చేసింది.
గత ప్రభుత్వంలో ఏడాదిలో ఎప్పుడైనా కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇవ్వడం సాధారణంగా జరిగేదని, కానీ ఇకపై ఈ విధానాన్ని కట్టుదిట్టం చేస్తూ నిర్ణీత సమయానికి మాత్రమే దరఖాస్తులు స్వీకరించాల్సిన అవసరం ఉంటుందన్నారు.
ఈ నిర్ణయంతో కొత్త కంపెనీలకు అనుమతులు ఇవ్వడంలో నాణ్యత, మార్కెట్లో వాటి ఆదరణ, సరఫరా సామర్థ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.
మరోవైపు ఇష్టమొచ్చిన చెత్త పేర్లతో మద్యం కంపెనీలు రాకూడదని స్పష్టం చేశారు.
Details
నాసిరకం కంపెనీలకు అనుమతులు ఇవ్వకూడదు
నాసిరకం కంపెనీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదన్నారు.
ఇప్పటికే మద్యం సరఫరా చేస్తున్న పాత కంపెనీలు కొత్త బ్రాండ్లు ఉత్పత్తి చేస్తే వాటిని పరిశీలించి అనుమతించే విధానాన్ని పాటించాలని సూచించారు.
ఇకపై ఎక్సైజ్ శాఖలో పెండింగ్‌లో ఉన్న మైక్రో బ్రూవరీలు, ఎలైట్ బార్లు, ఖాళీగా ఉన్న మద్యం షాపుల కేటాయింపుల విషయంలో కొత్త విధానం తీసుకురానున్నారు.
ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి, ఎక్సైజ్ శాఖ ఆదాయం ప్రోత్సహించడానికి కొత్త ప్రతిపాదనలు త్వరలో తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.