
Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థల తొలి జాబితాను ఆదివారం ప్రకటించింది. తొలి విడతగా 55 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది.
పార్టీకి సంబంధించిన కీలక నాయకుల పేర్లు తొలి జాబితాలోనే ఉన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి బరిలో నిలిస్తున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి హజూర్‌నగర్, అతని సతీమణి కొదాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అలాగే భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి తమ తమ సిట్టింగ్ స్థానాలనే పార్టీ కేటాయించింది.
సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ ఆందోల్, జీవన్ రెడ్డి జగిత్యాల, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్
బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు.. అనుకున్నది సాధించిన మైనంపల్లి
ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి టికెట్ల దక్కాయి. అందులో ప్రధానంగా మైనంపల్లి హన్మంతరావు, అతని కుమార్డు రోహిత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఖరారు చేయడం గమనార్హం.
అలాగే వేముల వీరేశంను నకిరేకల్ నుంచి పార్టీ బరిలోకి దింపుతోంది. అలాగే జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ టికెట్ కేటాయించింది.
అసెంబ్లీ బరిలో తమ ఎంపీలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెడుతోంది. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితా ఇదే..
The Indian National Congress has released the first list of candidates for the Telangana Assembly elections, 2023. pic.twitter.com/KH2CzHK4iV
— Congress (@INCIndia) October 15, 2023