Loading...
Delimitation Bill: డీఎంకే నేతలతో కాంగ్రెస్‌ కీలక భేటి
డీఎంకే నేతలతో కాంగ్రెస్‌ కీలక భేటి

Delimitation Bill: డీఎంకే నేతలతో కాంగ్రెస్‌ కీలక భేటి

వ్రాసిన వారు Balachander Sharma
Nov 29, 2026
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

డీలిమిటేషన్‌ బిల్లుపై డీఎంకే వైఖరిలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతలు స్టాలిన్‌తో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి, కర్ణాటక నేత డీకే శివకుమార్‌, కేరళ నేత వీడీ సతీశన్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కూడా చెన్నై చేరుకున్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి సైతం ఢిల్లీ నుంచి రానున్నారు. లోక్‌సభలో 22 మంది సభ్యులున్న డీఎంకే ఈ బిల్లుకు మద్దతు ప్రకటించడం ప్రతిపక్ష కూటమిలో చర్చకు దారితీసింది.

Details

బిల్లుకు మద్దతుపై స్టాలిన్‌ వాదన ఇదే

డీలిమిటేషన్‌ విషయంలో తమ పార్టీ ఆందోళనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుందని స్టాలిన్‌ చెబుతున్నారు.

తాజా జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరిగి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందన్నది డీఎంకే ప్రధాన అభ్యంతరం.

అందుకే 1971 జనాభా లెక్కల ప్రాతిపదికను కొనసాగించాలని పార్టీ డిమాండ్‌ చేసింది.

తమ ప్రతిపాదించిన రెండు కీలక అంశాలకు బిల్లులో చోటు దక్కినందునే మద్దతు ప్రకటించామని స్టాలిన్‌ పార్టీ ఎంపీలకు వివరించారు.

Details

తమిళనాడు హక్కులపై వెనక్కి తగ్గేది లేదు

మరోవైపు ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ, సమావేశానికి వచ్చే నాయకుల అభిప్రాయాలను వింటామని స్పష్టం చేశారు.

జాతీయ స్థాయిలో డీలిమిటేషన్‌ అంశాన్ని మొదటగా లేవనెత్తింది డీఎంకేనేనని గుర్తుచేశారు.

తమిళనాడు హక్కుల పరిరక్షణ విషయంలో తమ పార్టీ రాజీ పడబోదని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఈ నేపథ్యంలో స్టాలిన్‌తో కాంగ్రెస్‌ నేతల చర్చలు ఏ మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. డీలిమిటేషన్‌పై ప్రతిపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

ADVERTISEMENT