PM Modi's meet with Pope: పోప్ కు మీరిచ్చే గౌరవం ఇదేనా ? కాంగ్రెస్ ను నిలదీసిన బీజేపీ
ఇటలీలో జరుగుతున్న జీ7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, పోప్ ఫ్రాన్సిస్‌ల మధ్య జరిగిన సమావేశాన్ని అవహేళన చేస్తూ కాంగ్రెస్ పార్టీ కేరళ యూనిట్ సోషల్ మీడియాలో చేసిన వ్యంగ్య పోస్ట్ పై బీజేపీ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. అప్పటి నుండి తొలగించిన పోస్ట్‌లో, పోప్‌తో ప్రధాని మోదీ ఉన్న చిత్రం "చివరిగా, పోప్‌కు దేవుడిని కలిసే అవకాశం వచ్చింది!" అనే వ్యాఖ్య ఉంది. తనకు తానూ "దేవుడు పంపించారని " అని తాను నమ్ముతున్నానని ప్రధాని మోడీ గతంలో చేసిన ప్రకటనకు ఇది రుజువు చేసినట్లయింది.
కాంగ్రెస్ పెద్దలు,ఈ మాటలను వారు సమర్థిస్తారా ?
ప్రధాని మోదీని,పోప్‌ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ, కేరళ బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ ట్వీట్ తీవ్రంగా ఖండించారు. రాడికల్ ఇస్లామిస్ట్‌లు,అర్బన్ నక్సల్స్‌చే నిర్వహిస్తున్న@INCIndia కేరళ 'X'హ్యాండిల్ జాతీయవాద నాయకులపై అవమానకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు,అది గౌరవనీయులైన పోప్ వంటి దిగ్గజాన్ని అపహాస్యం చేసే స్థాయికి దిగజారింది.ఇటువంటి వాటిని నిలిపి వేయాలని కోరారు. పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే,వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ,ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ వంటి కాంగ్రెస్ పెద్దలు ,అలాంటి మాటలను వారు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేరళలో క్రైస్తవ మతం మూడవ అతి పెద్ద మతంగా ఉందన్నారు.
సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలి
ఇతర మతాలను కించపరిచే చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని,కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఐటీ సెల్ ఇన్‌చార్జి అమిత్ మాల్వియా ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా,దేవుడిపై జోక్ చేయడం మతవిశ్వాశాల కాదని పోప్ ఫ్రాన్సిస్ చేసిన ప్రకటనను కేరళ కాంగ్రెస్ ఉదహరించింది. "మీరు ఒక ప్రేక్షకుడి పెదవుల నుండి తెలివైన చిరునవ్వులు చిందించగలిగినప్పుడు,మీరు దేవుడిని కూడా నవ్విస్తారని పోప్ ఫ్రాన్సిస్ చేసిన ట్వీట్ ను ఆ పార్టీ పోస్ట్ చేసింది. శుక్రవారం,నాడు నరేంద్ర మోడీ, పోప్ ని కలిసిన సంగతి విదితమే.తీవ్ర వ్యతిరేకత, వివాదాల మధ్య, కేరళ కాంగ్రెస్ పోస్ట్‌ను తొలగించి, ఏ మతాన్ని , మతపరమైన వ్యక్తులను అవమానించే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసింది. "