హై స్పీడ్‌తో హైదరాబాద్-విశాఖపట్నం రహదారి నిర్మాణం; 56 కి.మీ తగ్గనున్న దూరం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ - వైజాగ్ ను కలుపుతూ నాలుగు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) శరవేగంగా చేపడుతోంది.
ఈ రహదారి ఖమ్మం జిల్లా గుండా వెళుతుంది. రూ. 2,200కోట్లతో సెప్టెంబర్ 2022లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇప్పటికే దాదాపు భూసేకరణ ప్రక్రియ పూర్తయింది.
ప్రాజెక్టు కోసం 1,332 ఎకరాలు భూమి అవసరం కాగా, ఇందుకు అవసరమైన భూసేకరణ 95% పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. ఖమ్మం-దేవరపల్లి నాలుగు లైన్ల రహదారి ఖమ్మం జిల్లాలో 89 కి.మీ మేర సాగనుందని వెల్లడించారు.
రహదారి
రహదారి నిర్మాణం 2024 నాటికి పూర్తవుతుందని అంచనా
నాలుగు లేన్ల రహదారిని మూడు ప్యాకేజీలుగా విభజించారు. దిల్లీకి చెందిన కంపెనీ రెండు ప్యాకేజీలను తీసుకోగా, మిగిలిన ప్యాకేజీని ఏపీకి చెందిన కంపెనీ తీసుకుంది.
రహదారి నిర్మాణం 2024 నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్ట్ ఆఫీసర్ వీ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ రహదారి అమలులోకి వస్తే, హైదరాబాద్ -విశాఖపట్నం మధ్య దూరం 56 కిమీ తగ్గుతుంది.
ప్రస్తుతం 10 కి.మీ మేర బిటి రోడ్డు వేయగా, భూసేకరణ కోసం రైతులకు ఎన్‌హెచ్‌ఎఐ రూ.200 కోట్లు చెల్లించింది. నాలుగు లైన్ల రహదారి నిర్మాణం వల్ల హైదరాబాద్-విశాఖపట్నం మధ్య కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడుతుంది. ఇది ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. తద్వారా ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.