Loading...
Mizoram CM Lalduhoma: అమరావతి నిర్మాణ పనులు భేష్‌.. మిజోరం సీఎం ప్రశంసలు!
అమరావతి నిర్మాణ పనులు భేష్‌.. మిజోరం సీఎం ప్రశంసలు!

Mizoram CM Lalduhoma: అమరావతి నిర్మాణ పనులు భేష్‌.. మిజోరం సీఎం ప్రశంసలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 20, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పనులు అద్భుతంగా ఉన్నాయని మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా ప్రశంసించారు. సోమవారం ఆయన అమరావతిలో పర్యటించి, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఐకానిక్‌ టవర్స్‌ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న జీఏడీ టవర్స్‌పైకి వెళ్లి పనులు జరుగుతున్న తీరును స్వయంగా గమనించారు. ఈ సందర్భంగా అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, నిర్మాణ పనుల్లో ఉపయోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక విధానాల గురించి సీఆర్డీఏ, ఏడీసీఎల్‌ అధికారులు మిజోరం సీఎంకు వివరించారు. రాజధాని నిర్మాణంలో అనుసరిస్తున్న విధానాలు, చేపడుతున్న పనుల పురోగతిని ఆయనకు తెలియజేశారు.

వివరాలు

ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ

అనంతరం మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న ఆయనకు మంత్రి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా చంద్రబాబు లాల్దుహోమాను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చంద్రబాబు ఆయనకు వివరించారు.

ADVERTISEMENT