LOADING...
TVK leader: రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. టీవీకే నేత క్షమాపణలు
రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. టీవీకే నేత క్షమాపణలు

TVK leader: రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. టీవీకే నేత క్షమాపణలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 18, 2026
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత నటుడు ర‌జ‌నీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న అధవ్ అర్జున తాజాగా క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు రజనీకాంత్‌ను కించపరిచే ఉద్దేశంతో కాదని స్పష్టం చేశారు. బుధవారం తమిళగ వెట్రీ కజగం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు. మా నాయకుడు విజ‌య్‌కు ఆదర్శంగా ఉన్న రజనీకాంత్‌ను అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు. నేను చెప్పింది డీఎంకే కుట్ర గురించే. బహుశా ఆయన నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. ఆయన బాధపడ్డారనిపిస్తోంది. కానీ నా ఉద్దేశం వేరు. ఈ పరిణామం నన్ను బాధించిందని అర్జున తెలిపారు. చిన్న వయసులోనే ఎన్నికల్లో పనిచేసే అవకాశం నాకు వచ్చింది.

Details

ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ నుంచి ఒత్తిళ్లు వచ్చాయి

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పుడు సుమారు 18 శాతం ఓటర్లు ఆయన వైపు మళ్లినట్లు అప్పటి సర్వేలు సూచించాయి. అది గొప్ప విషయం. ఆ గణాంకాలు ఆయన ప్రత్యర్థుల్లో భయాన్ని కలిగించాయని పేర్కొన్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో అర్జున మాట్లాడుతూ, రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించిన సమయంలో ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ నుంచి ఒత్తిళ్లు వచ్చాయని ఆరోపించారు. అయితే తన ఉద్దేశం రజనీపై విమర్శలు చేయడం కాదని, అలాంటి ఒత్తిళ్లకు తమ నాయకుడు విజయ్ తలొగ్గరని చెప్పడమేనని వివరించారు. టీవీకేలో ఉన్న ఒక సీనియర్ నేత నాపై చేసిన ఆరోపణలు అసత్యం. కాలం మౌనం పాటించినా, సరైన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు బయటపడతాయంటూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.

Advertisement